చిన్న పథకం అమలుకు కొండత కసరత్తు దేనికోసం -షర్మిల 1 d ago
మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. కాలయాపన తప్ప ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదని, అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు, పబ్బాలు పేరు చెప్పి దాటవేశారని మండిపడ్డారు. బస్సులు కొంటున్నాం అని చెప్పుకొచ్చారని, ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం పేరుతో మరికొన్ని రోజులు సాగతీతకు సిద్ధమైయ్యారని అన్నారు.
ఉచిత ప్రయాణం కల్పించడంలో ఇన్ని బాలారిష్టాలు ఎందుకు? చిన్న పథకం అమలుకు కొండత కసరత్తు దేనికోసం? తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పథకం అమలు చేసి చూపించారు కదా?. ఉన్న బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు కదా ? పథకం అమలును బట్టి అదనపు ఏర్పాట్లు చేసుకున్నారు కదా? జీరో టిక్కెట్ల కింద నెలకు రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడానికి మీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? మహిళల భద్రతకు మీకు మనసు రావడం లేదా? ఇప్పుడైనా సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? కనీసం నూతన సంవత్సరం కానుక కిందైనా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీ చిత్తశుద్ది ఏంటో నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని షర్మిలా ట్వీట్ చేశారు.